exit polls | అసలు ఫలితాలకు దూరంగా.. మూడు ప్రధాన ఎగ్జిట్ పోల్స్
exit polls | లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధానంగా మూడుసార్లు రుజువైంది.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ (exit polls) అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధానంగా మూడుసార్లు రుజువైంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ 139-161 సీట్లతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అసలు ఫలితాల్లో ఎన్డీయేకు మెజారిటీ రాగా, 110 సీట్లకే మహాకూటమి పరిమితమైంది.
కాగా, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే అసలు ఫలితాల్లో 284 స్థానాలకు గానూ టీఎంసీ 213 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 77 సీట్లు దక్కాయి. అలాగే 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పని తేలాయి.
మరోవైపు 2004 లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే 240-275 సీట్లతో సునాయాసంగా విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే యూపీఏ 216 సీట్లు సాధించగా, ఎన్డీయే 187 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2024లో కూడా ఇదే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.
కాగా, ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి వెళ్లేటప్పుడు వారు ఎవరికి ఓటు వేశారు అని సర్వేలో చెప్పిన దాని ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తారు. అయితే ఓటర్లు ఎంత ఖచ్చితంగా చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ నమూనాల ద్వారా సేకరించే సమాచారం వంటి వాటిపై వీటి ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

