చెన్నై: ప్రభుత్వ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిని లైంగికంగా వేధించారు. ఆమె క్లాస్మేట్ ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పింది. ఆ టీచర్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక బంధువు ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. (Teens Arrested) తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 22న ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జూనియర్ తరగతికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
కాగా, ఫిబ్రవరి 5న బాధిత బాలిక క్లాస్మేట్ ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పింది. ఆ టీచర్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా తొలుత పట్టించుకోలేదు. ఫిబ్రవరి 10న బాలిక బంధువు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆ బాలికను కలిసి వివరాలు సేకరించారు. జూనియర్ విద్యార్థినిపై విద్యార్థుల లైంగిక వేధింపు గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ స్కూల్‌కు వెళ్లి దర్యాప్తు చేశారు. బాలికను లైంగికంగా వేధించిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ యువకులను అదుపులోకి తీసుకుని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో నిర్లక్ష్యం వహించిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై కూడా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు.