రాజ్కోట్, మార్చి 14 : గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో శుక్రవారం ఓ 12 అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించగా ఒకరు గాయపడ్డారు. నగరంలోని 150 అడుగుల రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఈ భవనం లోపల దాదాపు 40 మంది చిక్కుకోగా వారిని కాపాడి వెలుపలికి తరలించినట్టు అధికారులు చెప్పారు. అట్లాంటిస్ అపార్ట్మెంట్లోని ఆరవ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్లో ఉదయం 9.30 గంటలకు మంటలు చెలరేగినట్టు వారు తెలిపారు. మంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి గాయపడినట్టు ఏఎస్పీ బీజే చౌదరి చెప్పారు. మధ్యాహ్నం కల్లా మంటలను అదుపులోకి తెచ్చినట్టు ఆయన చెప్పారు.