న్యూఢిల్లీ: అస్సాంలోని టిన్సుకియా, కకోపత్తర్ పట్టణంలో ఉన్న భారత సైనిక శిబిరంపై గురు-శుక్రవారాల మధ్య రాత్రి 12.15 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) తీవ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తున్నది.
19 గ్రెనేడియర్ యూనిట్పైకి గ్రెనేడ్లను విసరడంతో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.