న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాంతంత్య్రం, సమానత్వం, సౌబ్రాతృత్వంతోనే ఆదర్శ సమాజాన్ని తయారు చేయవచ్చు అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారని రాష్ట్రపతి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వం కాదు అని, ప్రజలను గౌరవించడమే ప్రజాస్వామ్యానికి పునాది అని, అంబేద్కర్ ఆదర్శ సూత్రాలను తమ ప్రభుత్వం ఆచరిస్తోందని రామ్‌నాథ్ తెలిపారు. ఆకలి బాధలను తీర్చేందుకు తమ ప్రభుత్వ ప్రతి నెల ఉచిత రేషన్ అందిస్తోందన్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆ రేషన్ ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార పథకాన్ని ఇండియా నిర్వహిస్తోందన్నారు. దీన్ని మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన్‌ధన్ అకౌంట్లు, ఆధార్ కార్డులను మొబైల్‌తో లింకు చేశామని, దీని ద్వారా కోట్లాది మందికి నేరుగా నగదు బదిలీ అయ్యిందన్నారు. కరోనా మహమ్మారి వేళ 44 కోట్ల మందికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజన పథకాన్ని కొనసాగిస్తోందని, ఇప్పటి వరకు 28 లక్షల మంది వీధి వ్యాపారులకు 2900 కోట్లు ఆర్థిక సాయం అందినట్లు ఆయన తెలిపారు. ఆ వ్యాపారులను ఆన్లైన్ కంపెనీలతో కలుతుపున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.