Boat capsize | అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 250 మంది గల్లంతు
Boat capsize | అండమాన్ సముద్రం (Andaman Sea) లో ఘోర ప్రమాదం జరిగింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయింది (Boat Capsizes). ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
Boat capsize : అండమాన్ సముద్రం (Andaman Sea) లో ఘోర ప్రమాదం జరిగింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయింది (Boat Capsizes). ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి (UNO) శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ప్రమాదానికి గురైన పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరినట్లు ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో పేర్కొన్నది. పడవ బంగ్లాదేశ్ నుంచి మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా పడవలో పరిమితికి మించి జనం ఎక్కడం కూడా ప్రమాదానికి మరో కారణమై ఉండవచ్చని తెలిపింది. మునిగిన పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేసియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదానికి గురైనట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌కు చెందినవారు. కానీ 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది మంది బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. దాంతో కాక్స్ బజార్లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఇటీవల అక్కడి పరిస్థితులు కూడా క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను వారు ఎంచుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

