Bengaluru Murder: బెంగుళూరు హాస్టల్లో బీహారీ అమ్మాయి మర్డర్.. మధ్యప్రదేశ్‌లో నిందితుడి అరెస్టు
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులోని వుమెన్స్ పీజీ హాస్టల్లో మంగళవారం 24 ఏళ్ల అమ్మాయి హత్యకు(Bengaluru Murder) గురైంది. కోరమంగల వెంకటరెడ్డి లే అవుట్లో ఉన్న భార్గవి స్టేయింగ్ హోమ్స్‌లో ఈ హత్య జరిగింది. బీహార్‌కు చెందిన కృతి కుమారి దారుణంగా హత్యకు గురైంది. సంచలనం రేపిన ఆ మర్డర్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్‌లో శుక్రవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం రాత్రి హాస్టల్ గదిలోకి వెళ్లిన నిందితుడు .. తన వద్ద ఉన్న కత్తితో కృతి కుమారిపై అటాక్ చేశాడు. బిల్డింగ్‌లోకి రాత్రి 11 గంటలకు చొరబడి, ఆమె మెడను కోశాడు. ఆ తర్వాత అక్కడనుంచి అతను పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కుమారితో పాటు ఆ రూమ్‌లో మరో అమ్మాయి ఉంటుంది. ఆమె స్నేహితుడే నిందితుడు అభిషేక్. అయితే నిందితుడు అభిషేక్ ప్రతిసారి కుమారి రూమ్మేట్తో గొడవపడేవాడు. ఆ ఇద్దరి మధ్య గొడవ ముదిరినప్పుడు.. కృతి కుమారి సర్దిచెప్పేది. అయితే అభిషేక్‌కు దూరంగా ఉండాలని తన మిత్రురాలికి కుమారి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆగ్రహానిక గురైన నిందితుడు.. కుమారిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హాస్టల్ కారిడార్‌లో జరిగిన ఈ మర్డర్ సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. కుమారి రూమ్ డోర్ తట్టిన నిందితుడు, ఆ తర్వాత ఆమెను కారిడార్‌కు లాక్కెల్లాడు, గోడకు ఆమెను నెట్టేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా..నిందితుడు ఆమెను నిలువరించాడు. ఆమె మెడలో కత్తితో దాడి చేశాడు. అరుపులతో అక్కడకు చేరుకున్న జనం.. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు కమీషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు గ్రూపులుగా అన్వేషించారు.
This happened in a PG hostel in Koramangala, Bengaluru 3 days ago
The killer has not been caught yet
He brutally killed Kriti Kumari by slitting her neck which was caught in CCTV camera but police haven’t caught him yet. This is how Law and order has deteriorated in our city… pic.twitter.com/vMO1SZykGv— Swathi Bellam (@BellamSwathi) July 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

