కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 12 : మావోయిస్టు పార్టీకి చెందిన 23 మంది తమ ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ శనివారం తెలిపారు. 9 మంది మహిళా మావోయిస్టులు సహా 23 మంది నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోయారని, వీరంతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సభ్యులని, వీరిపై పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.18 కోట్ల రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా.. నారాయణ్‌పూర్ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
భద్రాద్రిలో ఆరుగురు…
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో ఆరుగురు మావోయిస్టులు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శనివారం తెలిపారు.