బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 14:48:24

మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్

  మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్


శ్రీకాకుళం : కర్ణాటకలోని ఉడిపి జిల్లా మాల్ఫీ గ్రామంలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు,  భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జిల్లాకు చెందిన 300 మంది మత్యకారులతో పాటు ఆ రాష్ట్రంలో ఉపాధి కోసం వెళ్లి లాక్ డౌన్ కారణంగా చిక్కుకొన్న వలస కార్మికులను కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు ఎపి సీఎంవో తోనూ, ప్రత్యేక నోడల్ అధికారి, రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తోనూ మాట్లాడి బాధితుల సమాచారం అందజేసినట్లు చెప్పారు.  గుజరాత్ నుంచి మత్స్యకారులను జిల్లాకు రప్పించిన తరహాలోనే ఉడిపి లో ఉన్న వారిని కూడా తీసుకువస్తామని, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కలెక్టర్ జె. నివాస్ ను ఉడిపి కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వారికి ఆహారం, ఉండటానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు వివరించారు.


logo