గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 01:19:57

నెల క్రితమే ‘పద్మ’వ్యూహం

నెల క్రితమే ‘పద్మ’వ్యూహం

బెంగళూరు: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి దాదాపు నెల రోజుల క్రితమే వ్యూహం ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపాన ఒక రిసార్ట్‌లో బసచేసిన 19 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కనీసం రెండు వారాలు ఇక్కడే ఉంటారని బీజేపీ వర్గాల కథనం. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై చర్చించేందుకు రావాలని 15-20 రోజుల క్రితమే బీజేపీ అధిష్ఠానం కర్ణాటక పార్టీ నేత ఒకరిని ఆదేశించినట్లు తెలుస్తున్నది. 19 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల్లో ఒక స్వతం త్ర ఎమ్మెల్యేతోపాటు 8మంది వారం క్రితమే బెంగళూరుకు వచ్చారు. వారిలో స్వతంత్ర ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వెనుకకు వెళ్లారు. సోమవారం బెంగళూరుకు వచ్చిన 13మంది ఎమ్మెల్యేలు.. ఇప్పటికే బసచేసిన ఆరుగురితో జత కలిశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వీరికి వసతి బాధ్యతలను ఆ పార్టీ కర్ణాటక సీనియర్‌ నేత చూస్తున్నారు.


logo