న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ నిరసన కవాతులో పోలీసుల చర్య వల్ల గాయపడిన ఓ 20 ఏండ్ల యువతి రామ్ మనోహర్ లోహియా దవాఖానలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పోలీసుల అణచివేత వల్ల ఆమె బారికేడ్ను ఢీ కొట్టిందని నిరసనకారులు వెల్లడించారు. సంసద్ చలో నిరసనల్లో మొత్తం 90 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
ఇందులో మంగళవారం 79 మందిని డిశ్చార్చ్ చేశారు. ఘర్షణల్లో 118 మందికిపైగా పోలీసులు గాయపడ్డారని, 20 పోలీస్ వాహనాలు దెబ్బ తిన్నాయని ఢిల్లీ పోలీస్ విభాగం తెలిపింది. మరోవైపు నిరసనకారులు మంగళవారం జంతర్ మంతర్ వద్దకు తిరిగి చేరుకొని నిరసన కొనసాగించారు.