న్యూఢిల్లీ, జనవరి 1: కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకొన్నది. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకుపోవడంతో ఆమె మరణించింది. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని సుల్తాన్‌పురి ఏరియాలో చోటుచేసుకొన్నది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇదే సమయంలో ఓ మహిళ బట్టలు లేకుండా.. కాళ్లు విరిగి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో ఉన్నది ప్రమాదానికి గురైన యువతేనా కాదా అనేదానిపై స్పష్టత లేదు. ఆ ఫుటేజీని పరిశీలిస్తే నిందితులు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది యాక్సిడెంట్ మాత్రమేనని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి కోణం ఇందులో లేదని పేర్కొన్నారు.