Bengaluru | బెంగళూరుకు శాపంగా మారిన ప్రభుత్వాల నిర్లక్ష్యం.. ట్రాఫిక్ రద్దీతో రూ.20 వేల కోట్ల నష్టం
ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి తగినట్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో నగర ఆర్థిక వ్యవస్థకు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది.
Bengaluru | బెంగళూరు, ఆగస్టు 7: ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీకి తగినట్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడంతో నగర ఆర్థిక వ్యవస్థకు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నది. నెటిజన్లు, ప్రజా సంఘాలు నిత్యం విమర్శిస్తుంటే.. ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యపై ఒక అధ్యయనం చేయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేండ్లుగా భారీగా పెరిగిన నగర జనాభాకు, వాహనాలకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ లేకపోవడంతోనే ట్రాఫిక్ సమస్య పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మౌలిక సదుపాయాలను పరిశీలించి..అవి ట్రాఫిక్ రద్దీకి తగినట్టు లేవని, వాటిని మరింత మెరుగు పరచాలని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ట్రాఫిక్ జామ్‌ల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని అధ్యయన నివేదిక పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

