న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 20 స్కూళ్ల(Delhi Schools)కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అనేక స్కూళ్ల వద్ద స్క్వాడ్స్ ఉన్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన స్కూళ్లలో సివిల్ లైన్స్‌లోని సెయింట్ గ్జావియర్స్ , పశ్చిమ్ విహార్‌లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, ద సావిరిన్ స్కూల్ ఉన్నాయి. ఇతర స్కూళ్ల గురించి ఇంకా డిటేల్స్ అందాల్సి ఉన్నది.
బుధవారం కూడా సుమారు ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బెదిరింపు మెయిళ్లు రావడం వారంలోనే ఇది మూడోసారి. మంగళవారం ఉదయం నార్త్ క్యాంపస్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయి.
నార్త్ డీసీపీ రాజా బంతియా మాట్లాడుతూ.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి ఇవాళ ఉదయం 7.15 నిమిషాలకు ఈమెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. స్కూల్ క్యాంపస్‌లో నాలుగు ఐఈడీలు, రెండు ప్యాకెట్ల ఆర్డీఎక్స్ అమర్చినట్లు బెదిరించారు. మధ్యాహ్నం రెండు గంటల లోపు అవి పేలనున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు. సోమవారం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు ఉత్తవే అని తెలిసింది.
ఆప్ పార్టీ నేత, మాజీ సీఎం అతిశి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించింది. 20 స్కూళ్లకు బెదిరింపులు వచచాయని, దీని వల్ల పిల్లలు, పేరెంట్స్, టీచర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని వాళ్లకు అర్థంకావడం లేదని, ఢిల్లీ పాలన మొత్తాన్ని బీజేపీ కంట్రోల్ చేస్తున్నదని, కానీ ఎందుకు పిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నట్లు ఆమె ఆరోపించారు.