లక్నో: రోడ్డు మలుపులో ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పింది. ఒక పక్కకు బోల్తాపడింది. అక్కడున్న ఇద్దరు మహిళలు, చిన్నారిపై ఆటో పడింది. (E-Rickshaw Topples On Women) దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పరుగున వచ్చి వారిని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 20న ఒరై కొత్వాలి ప్రాంతంలోని ఇరుకైన వీధిలో ఎలక్ట్రిక్ ఆటో వెళ్లింది. టాప్‌పై కర్రలు తరలిస్తున్న ఆ ఆటో రోడ్డు మలుపులో అదుపుతప్పింది. ఒక షాపు వద్ద ఉన్న ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలికపై ఆటో బోల్తా పడింది.
కాగా, ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. పరుగున అక్కడకు వెళ్లారు. బోల్తాపడిన ఎలక్ట్రిక్ ఆటోను పైకి లేపారు. దాని కింద పడి తీవ్రంగా గాయపడిన తల్లీ కూతురు, మరో మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: 2 Women, 5-Year-Old Injured After E-Rickshaw Topples On Them In UP https://t.co/Ga7FOYUxQt pic.twitter.com/N5jDRQ5Cs8
— NDTV (@ndtv) May 21, 2025