Bengaluru | ట్రాఫిక్‌జామ్‌లో ఆసియాలోనే బెంగళూరు టాప్.. ఏడాదికి 132 గంటలు రోడ్డుపైనే..!
Bengaluru | మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరమే.
Bengaluru | మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరమే. స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరుది దేశంలోనే అగ్రస్థానం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోనే టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ (TomTom Traffic Index) 2023 ప్రకారం.. ఆసియాలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ పీక్ అవర్స్‌లో కేవలం 10 కిలోమీటర్ల దూరానికే ఏకంగా 28 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. అంటే ఈ టెక్హబ్లోని నివాసితులు ఏటా దాదాపు 132 గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకుపోతారు.
అందుకు కారణంగా బెంగళూరులో రద్దీకి తోడు నగరం వేగంగా విస్తరిస్తుండటమే. దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా బెంగళూరుకే వెళ్తుంటారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివసిస్తుంటారు. దీంతో పట్టణం కూడా బాగా విస్తరిస్తోంది. మరోవైపు ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రావడం లేదు. నగర రోడ్లలో ప్రయాణం నరకయాతంగా మారిపోయింది. ఇక పీక్స్ అవర్స్, హాలిడేస్‌లో ట్రాఫిక్‌ను తప్పించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది.
ఇక ఈ జాబితాలో బెంగళూరు తర్వాత పూణె రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరానికి 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతోంది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు) , తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు), జపాన్‌లోని సప్పోరో (26 నిమిషాల 50 సెకన్లు), తైవాన్‌లోని Kaohsiung City (26 నిమిషాలు), జపాన్‌లోని నగోయా (24 నిమిషాల 20 సెకన్లు), ఇండొనేషియాలోని జకార్తా (23 నిమిషాల 20 సెకన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టామ్‌టామ్ ట్రాఫిక్ సూచిక 6 ఖండాల్లోని 55 దేశాల్లో ఉన్న 387 నగరాల మీద రీసెర్చ్ చేసి నివేదిక విడుదల చేసింది. నగరాల్లో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులతోపాటు మరికొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని నివేదికను సిద్ధం చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూకేలోని లండన్ అత్యంత నెమ్మదిగా వాహనాలు కదిలే నగరంగా నిలిచింది. ఇక్కడ సగటున 10 కిలోమీటర్ల దూరానికి 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది.
Also Read..
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో భక్తులే లక్ష్యంగా బెదిరింపులు.. అప్రమత్తమైన యూపీ పోలీసులు
Sanjay Raut | 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగడం కష్టమే : సంజయ్ రౌత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

