ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ 20 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ బిల్డింగ్‌లోని 18వ ఫ్లోర్లో ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుంది. 13 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న భటియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన భవనాన్ని కమలా బిల్డింగ్‌గా పోలీసులు గుర్తించారు.
అగ్నిప్రమాదం సంభవించిన కమలా బిల్డింగ్‌ను బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధా, ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ పరిశీలించారు. భవనంలో ఉన్న అందరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామన్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయని, దీంతో ఆరుగురు వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. వారికి ఆక్సిజన్‌ను అందించేందుకు ఆస్పత్రికి తరలించామన్నారు.
#UPDATE | Two people have died in the fire incident that broke out in 20 storeys Kamala building near Mumbai’s Bhatia hospital in Tardeo: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) January 22, 2022