Cardiac Arrest | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గార్భా డ్యాన్స్ (Garba Dance) చేస్తూ 19 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జామ్నగర్ (Jamnagar)లో చోటుచేసుకుంది.
స్థానిక పటేల్ పార్క్ ప్రాంతానికి చెందిన వినిత్ మెహుల్భాయ్ కున్వరియా (19) అనే యువకుడికి డ్యాన్స్ అంటే పిచ్చి. ఈ నేపథ్యంలో వచ్చే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read..
Joe Biden | మహిళా అధికారిణిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం.. ఏడాదిలో 11వ ఘటన
Google | గూగుల్ 25వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక డూడుల్
Manipur Violence | మణిపూర్లో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల నిరసన.. పలువురికి గాయాలు