20ఏళ్లలో 1,888 మంది లాకప్‌డెత్.. ఎంతమంది పోలీసులపై నేరం రుజువైందంటే..?
police custody deaths | గడిచిన 20 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,888 లాకప్‌డెత్‌లు చోటు చేసుకున్నాయి. ఆయా కేసుల్లో కేవలం 26 మంది పోలీసులపై

న్యూఢిల్లీ : గడిచిన 20 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,888 లాకప్‌డెత్‌లు చోటు చేసుకున్నాయి. ఆయా కేసుల్లో కేవలం 26 మంది పోలీసులపై నేరం రుజువైనట్లు తేలింది. ప్రస్తుతం కస్టోడియల్ డెత్‌లు యూపీలో పెరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట కాస్గంజ్లో అల్తాఫ్ అనే యువకుడు పోలీసుల కస్టడీలో మరణించారు. అదే సమయంలో మంగళవారం కాన్పూర్‌లో దొంగతనం చేశాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆసుప్రతి నుంచి బయలుదేరే సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పోలీసులే కస్టడీలో సదరు వ్యక్తిని కొట్టి చంపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కస్టడీ మరణాలపై తీసుకున్న చర్యలేంటి?
అధికారిక లెక్కల ప్రకారం.. గత 20 సంవత్సరాలో లాకప్‌డెత్ కేసుల్లో 893 మంది పోలీసులపై కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా 358 మందిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. కానీ, లాకప్ మరణాలకు కేవలం 26 మందిపైనే నేరం రుజువైంది. 20ఏళ్లలో కస్టడీలో చనిపోయిన 1,888 మందిలో 1,185 మందిని ‘రిమాండ్‌లో ఉంచలేదు’ అని చూపించారు. కస్టడీలో ఉన్న 703 మరణాలను మాత్రమే రిమాండ్ సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా చూపించారు. అంటే గత 20 ఏళ్లలో పోలీస్ కస్టడీలో మరణించిన వారిలో 60 శాతం మందిని మరణానికి ముందు ఒక్కసారి కూడా కోర్టులో హాజరుపరుచలేదని స్పష్టంగా తెలుస్తోంది.
గతేడాది 76 మంది మృతి..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. గతేడాది అంటే 2020లో దేశవ్యాప్తంగా 76 మంది పోలీస్ కస్టడీలో మరణించారు. ఇందులో 15 కస్టడీ మరణాలతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. మృతుల్లో ఎవరూ దోషులుగా రుజువు కాలేదు. ఎన్సీఆర్బీ డేటా కూడా.. గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. అయినా, దోషులుగా రుజువు కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- lockup death
- NCRB
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

