కోల్‌కతా: పశ్చిమబెంగాల్లని హౌరాలో దారుణం వెలుగుచూసింది. హౌరా నగరంలోని ఉలుబేరియా మున్సిపాలిటిలో ఉన్న ఓ చెత్తకుప్పలో పిండాలు (Fetuses) కలకలం సృష్టించాయి. చెత్తకుండీలో పిండాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మొత్తం 17 పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది ఆడ, మరో ఏడు మగ పిండాలుగా గుర్తించారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తలరలించారు.
కాగా, ఉలుబేరియాలో 30 ప్రవేటు నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ పిండాలని మెడికల్ వేస్టేజ్‌గా పడేశారా లేదా బ్రూణహత్యలు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, పోస్టుమార్టం అనంతరం మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు.