న్యూఢిల్లీ: ఏనుగులు సంచరించే ప్రత్యేక ప్రదేశాలను గుర్తించారు. ఇండియాలో సుమారు 150 ఎలిఫెంట్ కారిడార్లు(Elephant Corridors) ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 15 రాష్ట్రాల్లో ఆ ప్రాంతాలు ఉన్నట్లు చెప్పింది. దీంతో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 26 కారిడార్స్ ఉన్నాయి. కేంద్ర పర్యావరణశాఖ దీనిపై రిపోర్టును రిలీజ్ చేసింది. కేంద్రం 2010లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. దేశంలో 88 ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నాయి. 2017లో నిర్వహించిన సర్వే ఆధారంగా.. ఇండియాలో 30వేల ఏనుగులు ఉన్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి జనాభాలో అది 60 శాతం కావడం విశేషం. 150 ఎలిఫెంట్ కారిడార్లను గుర్తించేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఇండియా, నేపాల్ మధ్య ఆరు ట్రాన్స్ నేషనల్ కారిడార్లు ఉన్నట్లు తెలుస్తోంది.