Akhnoor | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అక్నూర్ (Akhnoor)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది (bus falls in gorge). ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ప్రయాణికులు జమ్మూ నుంచి రియాసి జిల్లాలోని శివ్ ఖోరీ మందిరానికి బస్సులో వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు జమ్మూ-పూంచ్ హైవేపై చుంగీ మోర్హ్ (Chungi Marh) సమీపంలోకి రాగానే అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 28 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అక్నూర్ సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జీఎంసీ జమ్మూకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Arvind Kejriwal | దేశ రక్షణ కోసం 100 సార్లైనా జైలుకెళ్తా : అరవింద్ కేజ్రీవాల్
UK Parliament | సార్వత్రిక ఎన్నికలు.. బ్రిటన్ పార్లమెంట్ రద్దు
Anant Weds Radhika | జులై 12న ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో అనంత్ – రాధికల వెడ్డింగ్