న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరోమారు విరుచుకుపడింది. బలూచిస్థాన్‌లో మంగళవారం జరిపిన శక్తిమంతమైన ఐఈడీ బాంబు దాడిలో పన్నెండు మంది పాక్ సైనికులు మృతి చెందారు. కచ్చి జిల్లాలోని మాచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఐఈడీ పేల్చిందని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇటీవల కొంతకాలంగా బలూచిస్థాన్ వ్యాప్తంగా సైన్యం కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం 30-40 మంది సాయుధులు ప్రావిన్సుకు దారితీసే హైవేను దిగ్బంధించి పోలీసు ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు అధికారులను బందీలుగా పట్టుకున్నారు.