న్యూఢిల్లీ: రష్యా సైన్యంలో ఉన్న భారతీయులలో ఇప్పటి వరకు 12 మంది మరణించినట్టు తమ దృష్టికి వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన కేరళకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం తెలిపారు.
గాయపడిన మరో వ్యక్తికి చికిత్స జరుగుతున్నట్టు చెప్పారు. రష్యా సైన్యంలో ఇంకా 18 మంది భారతీయులు ఉన్నారని, వారిలో 16 మంది ఆచూకీ తెలియడం లేదని ఆయన వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన మొత్తం 126 మందిలో 96 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేశారని చెప్పారు.