బెంగళూరు : భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను రోదసిలోకి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భారత్ అంతరిక్షంలోకి పంపనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది, దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది.