ఉజ్జయిని: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో మరో ఘోరం చోటుచేసుకుంది. నెల రోజుల కిందట ఉజ్జయినిలో లైంగిక దాడి ఘటన మరువక ముందే తాజాగా అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు ఓ వ్యక్తి పదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాహితుడు తన ఇంట్లోని షెల్ఫ్‌లో కొన్ని వస్తువులను తీయడానికి సాయం చేయాలని బాలికను పిలిచి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం అర్ధనగ్నంగా బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.