సోమవారం 18 జనవరి 2021
National - Dec 26, 2020 , 10:01:55

యూకే నుంచి వచ్చిన పది మందికి కరోనా

యూకే నుంచి వచ్చిన పది మందికి కరోనా

బెంగళూరు : గత నెల 25 తర్వాత యూకే నుంచి తిరిగి వచ్చిన పది మంది ప్రయాణికులు ఇప్పటి వరకు కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. పది మంది నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. వారికి సోకింది కొత్త వైరస్సేనా? తెలుసుకునేందుకు పంపామని, ఫలితాలు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం.. దక్షిణాఫ్రికాలో గురించిన వైరస్‌ యూకేలో కనుగొన్న దానికంటే చాలా తీవ్రంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. పది మందికి సంబంధించిన నివేదికలు వచ్చిన తర్వాత.. వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాన్నారు. ఎయిర్‌ ఇండియా, బ్రిటిష్‌ ఏయిర్‌వేస్‌ నడుపుతున్న విమానాలలో నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22వ తేదీ వరకు సుమారు 2500 మంది రాష్ట్రానికి వచ్చారని, వారి ఆరోగ్యాన్ని గుర్తించడం, పర్యవేక్షించడం, పరీక్షలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  


ఇవి కూడా చదవండి..

అమెరికాలో పేలుడు కలకలం
నిల‌క‌డగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం..!
పోషియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం