పికప్ వ్యాన్‌లో విద్యుదాఘాతం.. 10 మంది కన్వరియాలు దుర్మరణం
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్‌బేహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కూచ్‌బేహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జల్పాయ్గురి దవాఖానకు తరలించారు. డీజే సిస్టం ఉన్న పికప్ వ్యానులో జనరేటర్ వైరు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ అయిందని పోలీసులు తెలిపారు.
కావడి యాత్రలో భాగంగా కన్వరియాలు కూచ్‌బేహార్ నుంచి జల్పేష్ పట్టణానికి వెళ్తున్నారని, ఆదివారం అర్ధరాత్రి సమయంలో ధార్ల బ్రిడ్జి వద్ద విద్యుదాఘాతం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వర్మ చెప్పారు. డీజే సిస్టం జనరేటర్‌కు ఉన్న విద్యుత్ వైరు వ్యాను వెనుకభాగంలో కట్టారని, అందులో విద్యుత్ ప్రసరించి వ్యానులో ఉన్న వారికి కరెంట్ షాక్ తగిలిందని వెల్లడించారు. వ్యాన్‌ను సీజ్ చేశామని, దాని డ్రైవర్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

