Maha Kumbh: ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై బస్సును ఢీకొన్న బొలెరో.. రోడ్డు ప్రమాదంలో 10 మంది భక్తులు మృతి
Maha Kumbh: మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ హైవేపై బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుంభమేళా వెళ్తున్న 10 మంది భక్తులు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్(Maha Kumbh)లో పుణ్యసాన్నాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వద్ద బొలెరో వాహనం బస్సును ఢీకొన్నది.
చత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లా నుంచి భక్తులు సంగం స్నానాల కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నుంచి వస్తున్న బస్సును.. బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ వారం ఆరంభంలోనే హైదరాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భక్తులు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాలో ఓ ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో హైదరాబాదీ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళాలో జనవరి 29వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందగా, 25 మందిని గుర్తించినట్లు పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిసలాటలో 60 మంది గాయపడ్డారు. జనవరి 13వ తేదీన మొదలైన మహాకుంభ్.. ఫిబ్రవరి 26వ తేదీన ముగియనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

