గుజరాత్లో కారు, బస్సు ఢీ.. 10 మంది దుర్మరణం
Gujarat | గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా మరణించారని పోలీసులు చెప్పారు. యాక్సిడెంట్ జరగడంతో బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, దీంతో అతడు కూడా అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. బస్సులో ఉన్నవారంతా సూరత్‌లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్‌కు హాజరై తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake OSD | మంత్రి శ్రీధర్ బాబు ఒఎస్డీనంటూ రూ.50 లక్షలు కాజేసిన దుండగుడు
PM Modi | ‘నేను సవాళ్లనే సవాల్ చేసే మనిషిని’.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దివికి దివికి’ విడుదల!
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

