న్యూఢిల్లీ ; న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఓ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. భారతీయ రైల్వే థాయ్లాండ్ నుంచి ఈ చెట్టును తెప్పించి ఇక్కడ నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు. దీనికి నెలకు రూ.2,500 విలువైన ప్రొటీన్లను, రూ.5,000 విలువైన ఎరువులు, నీటిని అందజేయవలసి ఉంటుంది.