అయ్య బాబోయ్..! మొసలిని అమాంతం మింగిన ఆలివ్ పైథాన్
Python Swallows Crocadile: మొసలి, కొండచిలువ మధ్య పోరాటం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన పోరాటానికి సంబంధించిన చిత్రాలే ఇప్పుడు సోషల్ మీడియాలో

హైదరాబాద్: మనం పిల్లి ఎలుక, పాము ముంగీస పోట్లాడుకోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అందరం ప్రత్యక్షంగా చూడకపోయినా మీడియాలోనో, సోషల్ మీడియాలోనో ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, మొసలి, కొండచిలువ మధ్య పోరాటం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన పోరాటానికి సంబంధించిన చిత్రాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
/https://public-media.si-cdn.com/filer/b2/4f/b24f7eea-e90b-47b6-99e8-f9ba048869f6/olive-python-crocodile_03_2019-07-05.jpg)
ఆస్ట్రేలియా దేశం క్వీన్స్‌ల్యాండ్‌లోని ఈసా పర్వత ప్రాంతంలో కయకెర్ మార్టిన్ అనే పర్యాటకుడు ఆ అరుదైన మొసలి-కొండ చిలువ పోరాటాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈసా పర్వత ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు ఓ నదీ తీరంలో మొసలి, ఆలివ్ కొండచిలువ పోట్లాడుకుంటున్న దృశ్యం కయకెర్కు కనబడింది. వెంటనే ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. అయితే, ఈ రెండు జంతువుల మధ్య జరిగిన పోరాటంలో ఆలివ్ కొండచిలువదే పైచేయి అయ్యింది.

పోరాటం జరిగిన ప్రాంతంలో నీళ్లు సరిగా లేకపోవడంతో మొసలి చేతులెత్తేసింది. దాంతో ఆలివ్ కొండచిలువ ఆ మొసలిని చుట్టేసి చంపింది. ఆ తర్వాత దాన్ని అమాంతం మింగేసింది. ఈ ఫొటోలను ‘సీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ’ సంస్థ రెండేండ్ల క్రితమే తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అయితే, ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలను కింది చిత్రాల్లో మీరు కూడా వీక్షించండి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

