మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Mar 09, 2020 , 23:57:07

కన్నుల పండువగా వెంకన్న కల్యాణం

కన్నుల పండువగా వెంకన్న కల్యాణం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ క్షేత్రంలో సోమవారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య నిర్వహించిన స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి హారతి ఇచ్చి తాళిబొట్టును భక్తులకు చూయించి వేద పండితులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందు కు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్‌విండో చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ అనిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచ్‌ చంద్రకళ, రమ్య, శ్రీకాంత్‌గౌడ్‌, రాంచంద్రయ్య, రాఘవేందర్‌గౌడ్‌, పాండురంగారెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, రాజేందర్‌రెడ్డి, చిన్నయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo