శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 17, 2020 , 01:27:35

జాతీయస్థాయి సూపర్‌ -7

జాతీయస్థాయి సూపర్‌ -7

క్రికెట్‌ చాంపియన్‌ తెలంగాణ
రన్నర్‌గా నిలిచిన చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ
మూడో స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్ర
ప్రతిభ చాటిన అంజలి, అనిత
మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ సూపర్‌ - 7 క్రికెట్‌ టోర్నీ ముగిసింది. ఈ టోర్నీ లో తెలంగాణ, బాల, బాలికల జట్లు చాంపియన్లుగా నిలిచాయి. బుధవారం బాలుర కళాశాల మైదానంలో బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు చత్తీస్‌గఢ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చత్తీస్‌గఢ్‌ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ జట్టు 5.1 ఓవర్లలో వికెట్‌ కొల్పోకుండా 70 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో అంజలి 24, అనిత 20 పరుగులు చేసి జట్టునే చాం పియన్‌గా నిలిపారు. రన్నర్‌గా చత్తీస్‌గఢ్‌ జట్టు నిలువగా, బాలుర విభాగంలో తెలంగాణ జట్టు విజేతగా, రన్నర్‌గా ఢిల్లీ జట్లు నిలిచాయి. మూడో స్థానం లో బాలికల విభాగంలో ఢిల్లీ, బాలుర విభాగంలో మహరా్రష్ట్ర జట్లు నిలిచాయి.
క్రీడల్లో గెలుపోటములు సహజం
క్రీడల్లో గెలుపు, ఓటము లు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని చా టాలని జిల్లా క్రికెట్‌ సంఘం ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి అన్నారు. క్రికెట్‌ టోర్నీ ముగింపు సందర్భంగా విజేలతకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. జాతీయ స్థాయి టోర్నీలో వివిధ రాష్ర్టాల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ టోర్నీలో ప్రతిభ చాటిన క్రీడాకారులు జాతీ య జట్టుకు ఎంపిక కావాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం టోర్నీలో విజేతలుగా నిలిచిన తెలంగాణ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 కార్యదర్శి పాపిరెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ సురేశ్‌కుమార్‌, టెక్నికల్‌ ఆఫీషియల్‌ బాల్‌రాజ్‌, రాష్ట్ర, జాతీయ పరిశీలకులు విశాల్‌పాఠక్‌,  బీఎస్‌ ఆనంద్‌, నరేందర్‌గౌడ్‌, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి రాజశేఖర్‌, సభ్యులు అశోక్‌, కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయు లు వేణుగోపాల్‌, అబ్దుల్లా, జగన్మోహన్‌గౌడ్‌, రాఘవేందర్‌, నాగరాజు, ముకరం, రామ్మోహన్‌తోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

VIDEOS

logo