రామన్నపేట, మార్చి14 : గ్రూప్- 3 పరీక్ష ఫలితాల్లో మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిల్వేరు సురేశ్ రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించాడు. 450 మార్కులకు గానూ 323.184 మార్కులు పొందాడు. ఇతను గ్రూప్‌లో -2లో కూడా రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంక్ సాధించాడు. సిల్వేరు సత్తయ్య, మంగమ్మల చిన్నకుమారుడైన సురేశ్ గ్రామంలోని నేతాజీ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివాడు. పాలిటెక్నిక్ డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు. గతంలో గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్స్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
గ్రూప్-3 లో మోత్కూరు వాసికి 29వ ర్యాంక్
మోత్కూరు : గ్రూప్-3 ఫలితాల్లో మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంకు సాధించాడు. ఆయన ఇప్పటికే గ్రూప్-2, గ్రూప్-4 పరీక్ష ఫలితాల్లో ప్రతిభను చాటాడు. గ్రూప్-1లోనూ 900 మార్కులగాను 446 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం యాదాద్రి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.