వలిగొండ, మే 30 : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మగాని వెంకటేశం (47) రోజు మాదిరిగానే కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వాహనంలో బాధితుడిని భువనగిరి ప్రభుత్వ దావాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.