రాజాపేట, ఏప్రిల్ 13 : రాజాపేట మండలంలోని కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తాసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాటు చేయడంతో సరుకుల కోసం దూర భారం తగ్గిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఠాకూర్ ధన్ రాజ్ సింగ్, వార్డు సభ్యులు మొగిలి యాకయ్య, కాకాల్ల భాగ్య ఐలయ్య, మొగిలి చంద్రయ్య, కాయతి వందన వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.