‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి.పాటిల్ రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు తక్కువ నీటితో సాగయ్యే...
– టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి.పాటిల్
– నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపునకు ఆరుతడి పంటల సాగు కీలకం
బీబీనగర్, అక్టోబర్ 21 : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి.పాటిల్ రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, చినరావులపల్లి, బట్టుగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వ్యవసాయ సమస్యలు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. వరి సాగుతో పోలిస్తే తక్కువ నీటితో పండించే కూరగాయలు, మునగ వంటి వాణిజ్య పంటల సాగుతో మెరుగైన ఆదాయం పొందే అవకాశాలున్నాయని వివరించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని తెలిపారు. తద్వారా రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందన్నారు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుతో భూగర్భ జలాల వినియోగం తగ్గడమే కాకుండా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కూడా ఆదా చేయవచ్చని చెప్పారు. రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను సీఎండీ ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంచుకోవడం, ప్రత్యామ్నాయ సాగును ప్రోత్సహించడం ద్వారా వనరులను సంరక్షించడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) ఎన్ . నరసింహులు, చీఫ్ ఇంజినీర్ యు.బాలస్వామి, సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.సురేశ్ కుమార్, భువనగిరి డివిజనల్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు, డివిజనల్ ఇంజినీర్ (ఎంఆర్ టీ) విజయభాస్కర్ రెడ్డి, బీబీనగర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ వి.మచ్చేందర్, అసిస్టెంట్ ఇంజినీర్ డి.మనోహర్ రెడ్డి, ఇతర అధికారులు, విద్యుత్ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

