సీఎం సహాయనిధి పేదలకు వరం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి

బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
అనంతరం అతడు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.2లక్షల చెక్కును హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రభుత్వ విప్ గొంగిడి బుధవారం లబ్ధిదారుకు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల సురేంద ర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నిరుగొండ రాజు గౌడ్, మోటే యాద గిరి, నిరుకొండ రమేశ్ గౌడ్, డోకూరి జంగయ్య, ఐలయ్య, మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం..
మోటకొండూర్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సబ్బండ కులాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ విప్ నివాసంలో మండల కేం ద్రానికి చెందిన ఎండీ షానూర్బాబాకు రూ. ఒక లక్ష, మండలంలోని సికిందర్‌నగర్ గ్రామానికి చెందిన షేక్ సుభానీకి రూ. 2లక్షలు, కాటేపల్లి గ్రామానికి చెందిన వరికుప్పుల రేణుకకి రూ. 60వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ.. వాటిని వంద శాతం అమలు చేస్తున్న ఏకైక నాయకుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బొట్ల యాద య్య, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సర్పంచ్‌లు మంత్రి రాజు, వేముల పాండు, కాటేపల్లి గ్రామ అధ్యక్షుడు కానుగంటి కొమురయ్య, సీనియర్ నాయకుడు ఏనుగు నాగిరెడ్డి ఉన్నారు.

Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

