యాదాద్రి భువనగిరి : రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించకపోవడం, సాగునీరు, కరెంట్ సరిపడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి ఇప్పటికైనా నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.