పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్‌లో గల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ)ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి..
– హుస్సేనాబాద్ కేజీబీవీ పరిశీలన
భువనగిరి అర్బన్, జూన్ 16 : భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్‌లో గల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ)ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన అడ్మిషన్ల వివరాలు, ఎన్ని కొత్త అడ్మిషన్లు వచ్చాయని, విద్యార్థినుల హాజరు శాతం ఎలా ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. రిపేర్ పనులు నెమ్మదిగా సాగుతున్న విషయంపై ఆరా తీసి ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేసి అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, పప్పు కూరగాయలునాణ్యతను పరిశీలించారు.
విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంట నూనె ప్యాకెట్లపై ఉన్న గడువు తేదీలను పరిశీలించి, కాలపరిమితి ముగిసిన వస్తువులు వినియోగించరాదని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం పేరుకుపోకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని బాగా ఏర్పాటు చేయాలని పరిశీలించి విద్యార్థుల వసతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులు చేయించారు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యాధికారి భిక్షపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
Sai Pallavi | సాయిపల్లవి నయా షేడ్.. ఇక కమర్షియల్ హీరోయిన్గా..!
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

