‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన సీపీఎస్ పరిధిలోని పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
– గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
– తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ పిలుపు
రామగిరి, అక్టోబర్ 27 : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన సీపీఎస్ పరిధిలోని పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన స్పందిస్తూ.. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో సమర్థవంతంగా ప్రస్తావించే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్ర ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, గడువులకు అనుగుణంగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సహచర పట్టభద్రులకు కూడా ఓటరు నమోదు ప్రాముఖ్యతను తెలియజేసి, అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు ఉద్యోగ వర్గాల సమస్యలకు పరిష్కార మార్గాలను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. “ఓటు హక్కు మన ప్రజాస్వామ్య బలం. అర్హులైన ప్రతి సీపీఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

