ప్రతి రోజూ పండుగే..
- సంబురంగా సాగిన వజ్రోత్సవాలు
- నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు
స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు 13 రోజులపాటు ఘనంగా జరిగాయి. ఈ నెల 9 నుంచి 21 వరకు 13 రోజులపాటు జిల్లాలో సంబురాలు జరగ్గా నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముగియనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని జిల్లా యంత్రాంగం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఏ రోజు ఎలా జరిగిందంటే..
- ఈ నెల 9న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 లక్షల జాతీయ జెండాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అందచేసింది.
- 10న గ్రామాల్లో 216 ఫ్రీడం పార్కులు, పట్టణాల్లో 19 ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కనిష్ఠంగా 75 మొక్కల నుంచి గరిష్ఠంగా 7,500 వరకు ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో 2.96 లక్షల మొక్కలు నాటగా, 19 మున్సిపాలిటీల్లో 22,500 మొక్కలు నాటారు.
- 11న పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని 71 మండలాలు, 19 మున్సిపాలిటీల్లో ఫ్రీడం రన్ ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు విద్యార్థులను భాగస్వామ్యం చేసి స్ఫూర్తిని నింపారు.
- 12న రాఖీ పండుగను పురస్కరించుకొని దేశభక్తి పెంపొందించే చిత్రాలు, డాక్యుమెంటరీలను స్థానిక కేబుల్ ఛానల్స్ ద్వారా ప్రసారం చేయించి స్వాతంత్య్ర సాధన, వాటి ఫలితాలను తెలియజేశారు.
- 13న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ విభాగంలోని ఎస్పీ మొదలు ఎస్ఐ స్థాయి వరకు వారి పరిధిలో ఫ్రీడం ర్యాలీలు నిర్వహించి దేశ స్వాతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తుచేశారు.
- 14న ఉమ్మడి జిల్లా కేంద్రమైన నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యార్థులు నిర్వహించిన 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శనలో పాల్గొని క్లాకటవర్ కేంద్రంలో 30 అడుగుల నిడివితో 100 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- 15న స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, యాదాద్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
- 16న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సూర్యాపేటలోలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, యదాద్రిలో విప్ సునీతా మహేందర్‌రెడ్డితోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. సాయంత్రం మూడు జిల్లాల్లో పౌర సమాచార శాఖ
ఆధ్వర్యంలో 113 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. - 17న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయా శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది కలెక్టర్ల సూచన మేరకు 38 శాఖల నుంచి కనిష్ఠంగా ఐదుగురు కంటే ఎక్కువగా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, యువకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- 18న గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఫ్రీడం కప్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
- 19న ఆయా ప్రభుత్వ శాఖల యంత్రాంగం జిల్లాలో ఉన్న దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో ఆపన్నులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
- 20న మూడు జిల్లాల్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు 19 మున్సిపాలిటీల్లో రంగవల్లుల కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
- 21న వన మహోత్సవం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మొక్కలు నాటారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు, తిరిగి 16 నుంచి 21వరకు రెండు విడుతలుగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించారు. 1.92 లక్షల మంది చిత్రాన్ని వీక్షించారు. ప్రతి గ్రామంతోపాటు పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మామిడి తోరణాలు కట్టి విద్యుద్దీపాలు అలంకరించారు.సోమవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వేడుకలు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

