నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు దాదాపు బెర్త్ ఖరారైనట్లే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కీలక మంత్రి పదవులు లభించనున్నాయి.
వాస్తవానికి వీరిద్దరు ముఖ్యమంత్రి పదవి రేస్‌లోనూ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు సీఎం పదవికి తాము అర్హులమేనని ప్రకటించారు. చివరి వరకు ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గట్టి ప్రయత్నమే