చివ్వెంల, మార్చి 31 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండలో గల సీతారామచంద స్వామి ఆలయ కమిటీని సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ పెద్దల సమావేశంలో ఆలయ చైర్మన్గా దాసరి నగేశ్, వైస్ చెర్మన్ – చింతల ముత్తిరాజు, కార్యదర్శి – గొడుగు వెంకన్న, కోశాధికారి – పల్లేటి జనార్దన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ – దర్గబోయిన శంకర్, కార్యవర్గ సభ్యులుగా గుడిసె భిక్షం, గుండు యాదగిరి, దోనేటి పిచ్చయ్య, చిలుముల సైదులు, గుండెబోయిన ముత్తయ్య, గుడిసె యల్లయ్య, చింతల జానయ్యను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేడబోయిన నాగరాజు, దోనేటి కార్తీక్, దాసరి లింగయ్య, అంబటి సైదులు, మేడబోయిన రామయ్య, పల్లేటి వీరబ్రహ్మం, బిట్టు రాంబాబు, ఇటుకూరి తిరుమలి, గుడిసె లింగయ్య, తోడుసు ప్రశాంత్, కాంపాటి గోవర్ధన్, అడప రంజిత్, మామిడి యల్లయ్య, దాసరి రమేశ్, దాసరి సైదులు, గుడిసె సైదులు, యలగబోయిన ముత్తయ్య, గుడిసె రామకృష్ణ, పల్లేటి పెద్ద సైదులు, పల్లేటి చిన్న సైదులు, బైరు సైదులు, గుండు రామ్మూర్తి, దాసరి పవన్ పాల్గొన్నారు.