భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 2 : మండలంలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని దేశ్ముఖి గ్రామం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు గంధ జతిన్(18), బొడ్డు శ్యామ్ చరణ్ (18), వర్జల శ్రీమాన్, భరత్.. కళాశాల సమీపంలోని ఓ క్వారీలో బుధవారం సాయంత్రం ఈతకు వెళ్లారు.
అందు లో జతిన్, శ్యామ్ చరణ్ క్వారీలో దిగగా మిగతా ఇద్దరూ ఒడ్డుకే ఉన్నారు. నీటిలోకి దిగిన ఇద్దరూ ఈత రాక మునిగిపోతుండడంతో వెంటనే ఇతర స్నేహితులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటలకు చరణ్ మృతదేహం లభించింది. జతిన్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాసర్ రెడ్డి తెలిపారు.