టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
బతుకమ్మ, దసరా పండుగలకు టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌కు రూ.35.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు రీజినల్ మేనేజర్ జోత్స్న తెలిపారు. పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఈ నెల 9 నుండి 26వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల ద్వారా...
నల్లగొండ సిటీ, అక్టోబర్ 28 : బతుకమ్మ, దసరా పండుగలకు టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌కు రూ.35.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు రీజినల్ మేనేజర్ జోత్స్న తెలిపారు. పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఈ నెల 9 నుండి 26వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల ద్వారా 50.99 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి 49,34,656 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు గాను రూ.35.98 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు చెప్పారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా 31,18,320 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం అనే నమ్మకంతో ప్రయాణం చేసిన వారికి సంస్థ తరపున ఆర్ఎం కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, కార్మికులు సమిష్టి కృషితో సమన్వయంతో అహర్నిశలు శ్రమించారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత సమర్థవంతంగా బస్సులు నడిపిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మెకానికులు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు, పాలనా సిబ్బందికి ఆమె ధన్యవాదములు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

