సీఎం కప్ క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్‌ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స్థాయిలో నిర్వహించే పోటీలు సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్నాయి.
- నేటి నుంచి మూడు రోజులు మండల స్థాయిలో..
- ఈ నెల 22 నుంచి జిల్లా స్థాయిలో..
- 15 నుంచి 36 సంవత్సరాల యువతకు అవకాశం
- గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికి తీయడమే
- లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వీటి నిర్వహణకు ఏర్పాటైన కమిటీలు క్రీడా స్థలాలను గుర్తించి గ్రామాల వారీగా క్రీడాకారుల నుంచి పేర్లు నమోదు చేయించుకున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 17 వరకు మండల స్థాయిలో మూడు రోజులపాటు వివిధ అంశాల్లో పోటీలు జరుగనున్నాయి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుంచి 24 వరకు పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్ పోటీలు ఉండనున్నాయి.
యాదాద్రి భువనగిరి, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్‌ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స్థాయిలో నిర్వహించే పోటీలు సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇప్పటికే క్రీడా పోటీల నిర్వహణపై అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ చైర్మన్‌గా, ఎంపీడీఓ కన్వీనర్‌గా, జడ్పీటీసీ, తాసీల్దార్, ఎంఈఓ లేదా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఐ, పీఈటీలు సభ్యులుగా కమిటీలను నియమించారు. ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు పాల్గొనేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. క్రీడలపై యువతకు అవగాహన కల్పించారు. పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేసి మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పాల్గొనే క్రీడాకారుల వివరాలను నమోదు చేసుకున్నారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్ (మహిళలు/ పురుషులు), ఫుట్‌బాల్ (పురుషులు), కబడ్డీ (మహిళలు/ పురుషులు), ఖోఖో (మహిళలు/ పురుషులు), వాలీబాల్ (మహిళలు/పురుషులు) పోటీలు నిర్వహించనున్నారు.
22 నుంచి జిల్లా స్థాయి పోటీలు
మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు క్రీడలు జరుగనున్నాయి. జిల్లా స్థాయిలో 11 విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి. అథ్లెటిక్స్ (మహిళలు/పురుషులు), ఫుట్‌బాల్ (మహిళలు/పురుషులు), కబడ్డీ (మహిళలు/పురుషులు), ఖోఖో (మహిళలు/పురుషులు), వాలీబాల్ (మహిళలు/పురుషులు), బ్యాడ్మింటన్ (మహిళలు/పురుషులు), బాస్కెట్‌బాల్ (మహిళలు/పురుషులు), బాక్సింగ్ (పురుషులు), హ్యాండ్‌బాల్ (మహిళలు/పురుషులు), స్విమ్మింగ్ (మహిళలు/పురుషులు), రెజ్లింగ్ (పురుషులు) పోటీలు జరుగనున్నాయి. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు
సీఎం కప్ క్రీడలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలకు అన్ని ఏర్పాట్లు చేశాం. నేటి నుంచి మండల స్థాయిలో క్రీడలు ప్రారంభం కానున్నాయి. ప్రతిభ కనబరిచిన గ్రామీణ క్రీడాకారులు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుంది. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకొని మంచి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. ఈ అవకాశాన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకట్‌రెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

