చెరువులు నింపి సాగు నీరందించాలి
ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.
- కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్
- బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి
రాజాపేట, జూలై 22 : ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. కాళేశ్వరం 15 ప్యాకేజీ ద్వారా రాజాపేట మండలంలోని చెరువులు, కుంటలు నింపి సాగు నీరందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ ఆధ్వర్యంలో రాజాపేట నుంచి బేగంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు వారు మహాత్మాగాంధీ, అం బేదర్, సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేక మెట్ట పం టలు, వరి పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్పై ద్వేషంతో కాళేశ్వరం నీటిని బంద్‌పెట్టి.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాలతో ఆలేరు నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు సైతం కళకళలాడాయని, ప్రస్తుతం కాల్వల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండి రైతులు దికుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను నింపి, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాల్వల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను నింపి గంధమల్ల చెరువు ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలన్నారు. రాజకీయాలను పకనబెట్టి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతుల తరఫున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, ఎర్రకోకుల జస్వంత్, గుంటి మధుసూదన్ రెడ్డి, నాగర్తి గోపాల్ రెడ్డి, ఉప్పలయ్య, సోమలిం గం బాలకృష్ణ, భోగ హరినాథ్, బిక్షపతి, కరుణాకర్, అం బాబయి, హర్షవర్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి,యమ్మ భాసర్, రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, చంద్రమౌళి, వెంకట్ రెడ్డి, సురేశ్, దేవులా నాయక్, కుమ్మరి పుల్లయ్య, ధర్మేందర్ సింగ్, చెరుకు కనకయ్య, మహిపాల్, ఉపేందర్ సింగ్, రవి, వెంకటేశ్, గోపాల్ గౌడ్, ఎల్లయ్య, సతీశ్, వెంకటేశ్ గౌడ్, ప్రశాంత్, హరినాథ్, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

