రామగిరి, అక్టోబర్ 06 : భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘మేరా యువ భారత్‌త్’ నిర్వహించిన వందేమాతరం క్యాంప్‌నకు పాండిచ్చేరి సందర్శనకు నల్లగొండలోని చర్లపల్లిలో గల టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ కళాశాల విద్యార్థినులు నలుగురు ఎంపికయ్యారు. మంగళవారం ప్రిన్సిపాల్ డా.పవిత్ర వాణి కర్ష ఎంపికైన విద్యార్థినులు టి.పల్లవి, కె.అర్చన, పి.అమృతకుమారీ, పి,జయంతిని అభినందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మొత్తం 13 ఎంపికయ్యారని, వారిలో నలుగురు తమ కళాశాల విద్యార్థినులు కావడం గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీవోలు ఎస్ఐ సుల్తానా, రజిత, వైస్ ప్రిన్సిపాల్ ఏ.మణెమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.